హైదరాబాద్‌కు చెందిన ఖుషీ గుప్తా VPR మిస్ ఇండియా 2022 1వ రన్నరప్ టైటిల్‌ను, మిస్ గార్జియస్ ఫేస్ 2022 ఉపశీర్షికను గెలుచుకుంది. ఖుషీ గుప్తా ప్రస్తుతం భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్‌లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి, దివంగత IFS అధికారి సంజీవ్ కుమార్ గుప్తా (93 బ్యాచ్), ఆమె తల్లి మునిసిపల్ కమిషనర్. ఈ కార్యక్రమం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో VPR ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా జరిగింది. మాజీ VPR 2021 విజేతలు మిస్ గుంజన్ విశ్వకర్మ, గాయత్రి చంద్రశేఖర్ ఖుషీకి కిరీటాన్ని ధరింపజేశారు.
Read Also : Aadavallu Meeku Johaarlu Review : అవుట్ డేటెడ్!
ఈ ఈవెంట్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేవారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి హోటల్ ప్రైడ్ ప్లాజా, అహ్మదాబాద్‌కు వచ్చారు. బెంజమిన్ డైమరీ, డింపుల్ సైకియా ద్వారా శిక్షణ పొందారు. ఖుషీ గుప్తా ఫిబ్రవరి 26న కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అక్కడ ఆమె సాంప్రదాయ దుస్తులు, డిజైనర్ దుస్తులు… ఇలా 4 రౌండ్‌లను ప్రదర్శించింది. ఇప్పుడు తాను ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియాను లక్ష్యంగా పెట్టుకున్నానని ఖుషీ గుప్తా పేర్కొంది.