నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక నాని “శ్యామ్ సింగ రాయ్” ప్రమోషన్ మొదలుపెట్టాడు. కోల్‌కత్తా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ డ్రామా హిందీ రీమేక్ గురించి అప్పుడే చర్చ మొదలైంది.
Read Also : టాప్ యాంగిల్లో ఎద అందాలను ఆరబోసిన ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ
ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న తాజా వార్త ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” హిందీ వెర్షన్ లో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడట. హృతిక్ రోషన్ హిందీ “శ్యామ్ సింగ రాయ్” గా కనిపించబోతున్నాడు అంటూ ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఇది క్రేజీ గాసిప్ నిజమని తేలితే, హృతిక్‌ని ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూడటం ఆయన అభిమానులకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
