NTV Telugu Site icon

Ntr Devara Update: దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..

Untitled Design (6)

Untitled Design (6)

జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో, హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కు మంచి ఆదరణ లభించింది. అనిరుధ్ మ్యూజిక్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిందనే చెప్పాలి. దేవర నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ చిత్రంపై మరింత హైప్ పెంచేశాయి. మరోవైపు ఇటీవల కాలంలో దేవర నుండి ఎటువంటి అప్ డేట్ రాలేదు. దింతో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ ను టాగ్ చేస్తూ దేవర గురుంచి ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. సెకండ్ సింగిల్‌ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నిర్మాతలను కోరారు. వినిపిస్తోన్న సమాచారం మేరకు దేవర షూటింగు దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. కేవలం రెండు పాటలు, వారం రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందని తెలిపారు యూనిట్ సభ్యుల సమాచారం. బ్యాలెన్స్ పార్ట్ త్వరగా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది దేవర టీమ్. అక్టోబరు 10న పాన్ ఇండియా భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది దేవర.

దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్స్‌ మరియు కొసరాజు హరికృష్ణ అధ్వర్యంలోని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Show comments