NTV Telugu Site icon

Umair Sandhu: బన్నీ-రష్మిక రిలేషన్షిప్… అది ట్విట్టరా లేక టాయిలెట్ కమోడా?

Umair Sandhu

Umair Sandhu

రీచ్ కోసం, వ్యూస్ కోసం సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడూ ఎవరో రాసే ఎవో కొన్ని గాలి వార్తలు సోషల్ మీడియాలో వినిపించడం షరా మాములే. ఆ షూటింగ్ ఆగిపోయింది, ఈ హీరో నెక్స్ట్ ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడు, పలానా సినిమా షూటింగ్ డిలే అవుతుంది… ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ కి మంచి రీచ్ ని తెస్తాయి. అయితే ఇది సరదాగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది కానీ మరీ హద్దులు దాటితేనే అసహ్యంగా ఉంటుంది. అలాంటి అసహ్యాన్ని ట్విట్టర్ అకౌంట్ నిండా మైంటైన్ చేసే సోషల్ మీడియా  సెలబ్రిటీ ఒకరున్నారు, అతని పేరు ‘ఉమైర్ సంధు’. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుంటాడు కానీ అఫీషియల్ గా ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ అడల్ట్ గాసిప్స్ అని అతను పెట్టుకున్నా బయో చూస్తే చాలు ఆ అకౌంట్ లో ఎలాంటి ట్వీట్స్ వస్తాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇతను దళపతి విజయ్ నుంచి మన విజయ్ దేవరకొండ వరకూ ప్రతి ఒక్కరికీ ఇల్లీగల్ అఫైర్ అంటగట్టగలడు. ఏ భార్య భర్తని అయినా సోషల్ మీడియాలోనే విడగోట్టేయగలడు. అజిత్-శాలిని విడిపోతున్నారు, విజయ్-కీర్తి సురేష్ ని డేటింగ్ చేస్తున్నాడు. నాని దసర సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ని లవ్ చేశాడు, చిరు యంగ్ హీరోయిన్స్ తో ఆడ్ గా బిహేవ్ చేస్తున్నాడు, రామ్ చరణ్-ప్రియాంక చోప్రా కలిసి హోటల్ లో టైం స్పెండ్ చేశారు, సూర్య-దిశా పటాని ముంబైలో కలిసి ఉంటున్నారు, అజయ్ దేవగన్-కంగనా షూటింగ్ సమయంలో…(ఇక్కడ అతను ఒక పదం వాడాడు, అది వాడడం ఇష్టం లేక … పెట్టాల్సి వచ్చింది), కంగనా-హ్రితిక్ రోషన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ప్రెగ్నెంట్, విజయ్ దేవరకొండ రష్మికతో విడిపోయిన తర్వాత సమంతతో కలిసి శ్రీనగర్ లో హోటల్ లో టైం స్పెండ్ చేశాడు, మహేశ్ బాబు-పూజా హెగ్డే షూటింగ్ టైంలో వ్యానిటీ వ్యాన్ లో టైమ్ స్పెండ్ చేశారు… ఇవి కేవలం ఒక ఇరవై రోజుల గ్యాప్ లోనే ఉమైర్ సంధు ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్స్.

ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. మీకు నచ్చిన ఏ హీరో, హీరోయిన్ గురించి అయినా సరే వార్తలు రాగాయల మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇతను. ఇతని నుంచి వచ్చిన లేటెస్ట్ ట్వీట్… “అల్లు అర్జున్-రష్మిక ప్రైవేటు ప్లేన్ లో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బన్నె వైఫ్ కి ఈ విషయం తెలిసినా, ఆమె దీన్ని పట్టించుకోలేదు”. ఈ ట్వీట్ చేస్తూ ఉమైర్ సంధు ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాడు, ఇందులో రష్మిక-అల్లు అర్జున్- ప్రైవేటు ప్లేన్ అన్నీ ఉన్నాయి, వీటితో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు.

ఒక ట్వీట్ చేసే ముందు రీచ్ మాత్రమే చూసే ఉమైర్ సంధు అకౌంట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నవి రూమర్స్ మాత్రమే కాదు, అవి జుజుబీ అనిపిస్తాయి. కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ లింక్ పెట్టి పోస్ట్ చేసి, రీచ్ ని ఎంజాయ్ చెయ్యడం ఇతనికి మాత్రమే చెల్లింది. ఇంకా కొన్ని ట్వీట్స్ చూస్తే అది అసలు ట్విట్టర్ అకౌంటేనా లేక టాయిలెట్ కమోడా అంత అరాచకంగా ట్వీట్స్ ఎలా వేస్తున్నాడు అనే జుగుప్స కలగడం గ్యారెంటీ. సరదాగా ఎప్పుడైనా ఇతని ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి, మీ హీరో గురించి కూడా ఇలాంటి అసభ్య, అసహ్య కరమైన రూమర్స్ ఏమైనా రాసాడేమో.

Show comments