కేంద్ర ప్రభుత్వం ఇటీవలప్రకటించిన 71వ నేషనల్ అవార్డ్స్ పలు వివాదాలకు దారి తెస్తోంది. కథ బలం, అద్భుతమైన నటన కనబరిచిన నటులకు కాకుండా తమ సొంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ అవార్డులు ప్రకటించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. తాజాగా సీనియర్ నటి ఊర్వశి నేషనల్ అవార్డ్స్ జ్యూరీ పై విమర్శలు గుప్పించింది. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో నటి ఊర్వశికి ఉళ్ళోజుక్కు అనే మలయాళం సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ ” అసలు నాకు బెస్ట్ సహాయం నటి అవార్డు ఎలా ఇచ్చారు. సహాయనటి అంటే ఏమిటో జ్యూరీ చెప్పాలి. ఉళ్ళోజుక్కులో నా నటనను ఏ పద్దతిలో కొలిచారు. సపోర్టింగ్ అనే కేటగిరిలో నాకు ఎలా అవార్డు ఇచ్చారు. వయసు పైబడితే సహాయనటిగా పరిగణిస్తారా, మీరు ఇవ్వగానే వచ్చి సైలెంట్ గా తీసుకోడానికి అదేమీ పెన్షన్ కాదు అని నేషనల్ అవార్డ్స్ జ్యూరీని ప్రశ్నించింది.
షారుక్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎలా ఇస్తారు..?
అలాగే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు జవాన్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం పట్ల ఊర్వశి విమర్శలు గుప్పించింది. అసలు షారుక్ ఖాన్ కు ఎలా ఆ అవార్డు ఇస్తారు. పూక్కళమ్ అనే సినిమాకు గాను మలయాళ నటుడు విజయ రాఘవన్ కి బెస్ట్ సపోర్టింగ్ కేటగిరిలో అవార్డు ఇచ్చారు. అసలు విజయ్ రాఘవన్ కు బెస్ట్ యాక్టర్ ఇవ్వాలి. పూక్కళమ్ సినిమాలో ఓ పాత్రను నన్ను చేయమని అడిగితె నాకు కష్టం అనిపించి చేయలేదు. కానీ విజయ్ రాఘవన్ ఎంత కష్టమైనా ఆ పాత్ర చేసాడు. కానీ అతడికి సపోర్టింగ్ రోల్ పేరుతో అవార్డు ఇచ్చారు. అది పెద్ద సినిమా, 250 కోట్ల సినిమా కాదు, అంత పెద్ద హిట్ అవ్వలేదు అని అవార్డు ఇవ్వలేదా. షారుక్ ఖాన్ గతంలో మంచి నటన కనబరిచిన సినిమాలకు ఇవ్వకూడా జవాన్ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఏంటో నేషనల్ అవార్డ్స్ జ్యూరీకె తెలియాలి అని విమర్శించారు.
