Allu Arjun : అల్లు అర్జున్ చేసిన పనికి విజయ్ దేవరకొండ కెరీర్ మారిపోయిందంట. ఈ విషయం పాతదే అయినా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. విజయ్ చేసిన అర్జున్ రెడ్డి అతని కెరీర్ ను మార్చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. అయితే ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ వద్దకే వెళ్లిందంట. కానీ ఆయన ఇలాంటి సినిమాలో తాను నటిస్తే ఏం అవుతుందో అని వెనకడుగు వేశాడు. ఎందుకంటే తెలుగులో అప్పటి వరకు అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా రాలేదు. పైగా స్టార్ హీరోలు అలాంటి సినిమాల్లో అస్సలు నటించట్లేదు. కాబట్టి దాన్ని వద్దన్నాడంట బన్నీ.
Read Also : OG : ప్రమోషన్లకు పవన్ దూరంగా ఉంటాడా.. అసలు కారణం అదే..
అదే కథను ఎవరితో తీయాలా అని సందీప్ రెడ్డి తిరుగుతున్న టైమ్ లోనే విజయ్ ఆయనకు కనిపించాడు. పైగా అప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్నాడు విజయ్. స్టార్ హీరోలు ఎవరూ నటించరని బన్నీతోనే సందీప్ కు అర్థమైంది. అందుకే కొత్త హీరో అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడు. ఆ గ్యాప్ లో బన్నీ కలిసినప్పుడు కూడా విజయ్ గురించి ఆలోచించమని చెప్పాడంట. దాంతో విజయ్ తోనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి. అలా అల్లు అర్జున్ వద్దనుకున్న సినిమాతోనే స్టార్ హీరో అయ్యాడు విజయ్. ఆ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత అనవసరంగా వదిలేశానే అని బన్నీ చాలా ఫీల్ అయ్యాడంట. ఇలాంటి కథలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు బన్నీ.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?
