How Aishwarya Arjun Umapathy Ramaiah fell in love without sharing screen: యాక్షన్ కింగ్ అర్జున్ తమిళ్,కన్నడ భాషలతో పాటు తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఆయన అప్పుడపుడు విలన్ పాత్రల్లో కూడా మెరుస్తున్నాడు. అయితే అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య వివాహం ఫిక్స్ అయినట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో ఆమె వివాహం ఫిక్స్ అయింది. ఇదే విషయంపై తంబి రామయ్య అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేయలేదు, ప్రాజెక్ట్ చేయలేదు కానీ అసలు ఎలా లవ్ లో పడ్డారు? అనే అనుమానాలు తెర మీదకు వస్తూ ఉండగా వారి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. సాధారణంగా కొన్ని సినిమాల్లో కలిసి నటించిన హీరో హీరోయిన్లు లేదా ఆడ, మగ ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం.
Aishwarya Sarja: స్టార్ హీరో కూతురుతో కమెడియన్ కొడుకు పెళ్లి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
కానీ యువ నటి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్యల విషయంలో వారు ఏ చిత్రంలో కూడా నటించకుండా ప్రేమలో పడిపోయారు. అర్జున్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ‘సర్వైవర్’ షూటింగ్‌లో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్‌గా ఉన్న సమయంలో ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారని, వారు ముందు కలిసినప్పుడు స్నేహంగా మొదలైన వారి పరిచయము ప్రేమకు దారి తీసిందని చెబుతున్నారు. అర్జున్ నిర్మించిన ఆంజనేయ ఆలయం ప్రారంభోత్సవంలో తంబి రామయ్య కుటుంబం మొత్తం పాల్గొన్నారు, అప్పుడే ఐశ్వర్య, ఉమాపతి ఒకరిపై ఒకరు సీరియస్‌గా ఉన్నారని ఇరు కుటుంబాలకు తెలిసి పెద్దలు ఆశీస్సులు అందించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని అంటున్నారు. అర్జున్, తంబి రామయ్య ఇద్దరూ పెద్ద స్టార్స్ కాబట్టి మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నభూతో న భవిష్యత్ అనే విధంగా ఈ వేడుకను చేయాలని భావిస్తున్నారు.