కోలీవుడ్ స్టార్ దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండవ సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read : Ravi Mohan : రవిమోహన్ నిర్మాణంలో తొలి సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్
ఇక విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ హీరోగా తమిళ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిర్నా మీనన్ ను ఎంపిక చేశారట మేకర్స్. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఉగ్రం, ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ కు చెందిన బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబందించి అధికారక ప్రకటన రానుంది.
