Honey Rose: టాలీవుడ్ కు రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతూ ఉంటుంది. కొంతమందికి త్వరగా గుర్తింపు వస్తే ఇంకొంతమందికి కొంచెం లేట్ గా గుర్తింపు వస్తోంది. కొన్నిసార్లు స్టార్ల సినిమాల్లో హీరోయిన్ కన్నా.. పక్కన ఉన్నవారే మరింత గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ఆ కేటగిరిలోకి వచ్చింది మలయాళ బ్యూటీ హనీ రోజ్. మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయ్ అంటూ ఒక ఒక్క సాంగ్ తో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గుడి కట్టేసింది. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన నటించి మెప్పించిన హీరోయిన్ హనీ రోజ్. మొదటి నుంచి అమ్మడి పేరు అస్సలు ఎవరికి తెలియదు. అసలు ఈ సినిమాలో అమ్మడు ఉంది అన్న విషయం కూడా ఆ సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడే తెల్సింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాత్ర చాలా సస్పెన్స్ అని చెప్పడంతో క్యారెక్టర్ మీదనే కాదు హనీ మీద కూడా టాలీవుడ్ ప్రేక్షకులు ఓ కన్నేశారు. జై బాలయ్య.. జై బాలయ్య.. అంటూ చక్కగా పేరుకు తగట్టు హనీ పూసి మాట్లాడిన హానీ రోజ్ తేనె పలుకులు అబిమనులను మెప్పించాయి. ఇక ఈ ఒక్క సినిమాతో అమ్మడి దశ మారిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడే నాలుగు సినిమాలు లైన్లో పెట్టేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమా హిట్టా.. ఫట్టా అనే సంబంధం కూడా లేదు. హనీ కావాలని నిర్మాతలు పట్టుబడుతున్నారట.. మరి ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న హనీ.. తెలుగులో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.