NTV Telugu Site icon

Salaar Makers: హోంబెల్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా…

Hoysala

Hoysala

KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ అంటేనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటి. బ్యాక్ టు బ్యాక్ హ్యుజ్ బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హోంబెల్ ఫిల్మ్స్ నుంచి మూవీ వస్తుంది అనగానే అది భారి ప్రాజెక్ట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి కూడా హోంబెల్ ఫిల్మ్స్ ముందుకొస్తున్నారు. ఈ బడా బ్యానర్ నుంచి ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘హొయసాల’. టాలెంటెడ్ యాక్టర్ డాలి ధనంజయ నటిస్తున్న 25వ సినిమాగా తెరకెక్కిన ‘హొయసాల’ సినిమాని విజయ్ డైరెక్ట్ చేశాడు. పవర్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో మేకర్స్, ఈ మూవీ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో గురుదేవ్ హొయసాల పాత్రలో గ్రే షెడ్ ఉన్న పోలిస్ పాత్రలో ధనంజయ ఇంటెన్స్ గా కనిపించాడు. కథని రివీల్ చెయ్యకుండా కేవలం క్యారెక్టర్ ఇంట్రో మాత్రమే చూపిస్తూ కట్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది. టీజర్ కి అజ్నీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకుంది. టీజర్ తో ఇంప్రెస్ చేసిన ‘హొయసాల’ చిత్ర యూనిట్ ట్రైలర్ తో అంచనాలు పెంచగలిగితే హోంబెల్ నుంచి మరో భారి ప్రాజెక్ట్ కన్నడలో వచ్చినట్లే. అక్కా హిట్ అయితే ఆ మూవీని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చెయ్యడానికి హోంబెల్ రెడీగా ఉంటుంది కాబట్టి ‘హొయసాల’ మేకర్స్ కన్నడలో హిట్ అవ్వాలి.

Show comments