Site icon NTV Telugu

Mohan Lal: లాల్ సినిమా కోసం రంగంలోకి దిగిన సలార్ ప్రొడ్యూసర్స్

Mohan Lal

Mohan Lal

మలయాళ సూపర్ స్టార్, టు టైమ్ నేషనల్ అవార్డు విన్నర్ మోహన్ లాల్ అకా లాలెట్టన్ బర్త్ డేని సినీ అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలు గడిచినా, యంగ్ హీరోలు వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్నా… ఫేస్ ఆఫ్ మలయాళ సినిమాగా మోహన్ లాల్ స్థానం చెక్కు చెదరకుండా ఉంది. కంప్లీట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం అయిన నటుడు కాదు. తెలుగు తమిళ భాషల్లో కూడా మోహన్ లాల్ కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రకి అయినా జస్ట్ కాళ్లతోనే ఎమోషన్ ని ప్రెజెంట్ చెయ్యగల మోహన్ లాల్ 62 ఏళ్ల వయసులో కూడా  సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ మూడు సినిమాలని చేస్తున్నాడు. ఇందులో లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ఎంపురాన్’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది, అందుకే ఎంపురాన్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లూసిఫర్ సినిమాని మలయాళ మార్కెట్ కే పరిమితం చేసిన మేకర్స్, ఎంపురాన్ సినిమాని బౌండరీలు దాటిస్తూ హోంబలే ఫిల్మ్స్ తో కోలాబోరేట్ అయ్యారు. హోంబలే బ్రాండ్ తో ఎంపురాన్ ని పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలి అనేది పృథ్వీరాజ్ ప్లాన్. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఈరోజు మోహన్ లాల్ పుట్టిన రోజు కావడంతో ఎంపురాన్ నుంచి స్పెషల్ విషెస్ పోస్టర్ బయటకి వచ్చింది. రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ‘జైలర్’ సినిమా నుంచి కూడా మోహన్ లాల్ బర్త్ స్పెషల్ వీడియో బయటకి వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా జైలర్ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీతో ముగ్గురు సూపర్ స్టార్ లని ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దొరుకుతుంది.

Exit mobile version