NTV Telugu Site icon

Hombale Films: హోంబలే వెనుక పవర్ స్టార్.. ఆ కథ ఏంటి.. ?

Hombale

Hombale

Hombale Films: హోంబలే ఫిల్మ్స్.. ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్.. ఇలా పాన్ ఇండియా సినిమాలన్నీ నిర్మించి.. ప్రపంచ వ్యాప్తంగా తమ పేరును వినిపించేలా చేస్తోంది. అయితే అసలు హోంబలే కు ఆ పేరు ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఆ కథాకమామీషు ఏంటి అనేది అభిమానులు తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం హోంబలే వెనుక ఉన్నది పవర్ స్టార్. ఏంటి.. నిజమా అంటే.. అవును.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. హోంబలే సంస్థను విజయ్ కిరగందూర్ నిర్మించాడు. ఆయనను ఎంతో ఎంకరేజ్ చేసిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. హోంబలే పేరును సజిస్ట్ చేసింది కూడా ఆయనే అంట. హోంబలమ్మ పేరుతో వస్తుంది అని హోంబలే ఫిల్మ్స్ అని పునీత్ పెట్టమన్నట్లు విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక ఈ నిర్మాణ సంస్థలో మొట్ట మొదటి సినిమా చేసింది కూడా పునీతే. 2014 లో నిన్నిందాలే అనే సినిమాతో ఈ నిర్మాణ సంస్థ మొదలయ్యింది. పునీత్ రాజ్ కుమార్ హీరో. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ నిర్మాణ సంస్థకు తిరుగులేకుండా పోయింది. 2015 లో యష్ హీరోగా మాస్టర్ పీస్ అనే సినిమాను నిర్మించారు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇక ముచ్చటగా మూడో సినిమా కూడా పునీత్ తోనే నిర్మించారు. రాజకుమారా.. అది కూడా సూపర్ హిట్.. ఇక హోంబలేను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది కెజిఎఫ్. అప్పటినుంచి ఇలాంటి నిర్మాణ సంస్థ ఉందని ప్రపంచానికి తెలిసింది. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి ఈ నిర్మాణ సంస్థ భారీ విజయాన్ని అందుకుంది. ఇలా పునీత్ రాజ్ కుమార్ వలన హోంబలే ఇక్కడవరకు చేరుకుంది. ఆయన హీరోగా .. ఒక పాన్ ఇండియా సినిమా నిర్మించాలని హోంబలే అనుకున్నది. కానీ, ఆలోపే పునీత్ మృతి చెందడంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. ప్రేక్షకులు మెచ్చే కథలను ఎంచుకొని సినిమాలు నిర్మించడం తమ బాధ్యత అని.. ముందు ముందు కూడా అలాంటి సినిమాలనే నిర్మిస్తామని హోంబలే ప్రమాణం చేసింది. మరి ముందు ముందు ఈ సంస్థ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.