Site icon NTV Telugu

Hombale Films : ‘కేజీఎఫ్-2’ నిర్మాణ సంస్థ క్రేజీ అప్డేట్

Hombale Films

Hombale Films

దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సందడి, రాఖీ భాయ్ వయోలెన్స్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగందూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ ను జేబులో వేసుకున్నారు. అంతేకాదు ‘కేజీఎఫ్’ మూవీ కారణంగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా కొత్త సినిమా గురించి ఓ ప్రకటన విడుదల చేసింది నిర్మాణ సంస్థ. “కొన్ని నిజమైన కథలను సరిగ్గా చెప్పాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా రివర్టింగ్ కథతో కొత్త ప్రారంభం” అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

Read Also : VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు “ఆకాశమే నీ హద్దురా” మూవీ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ మూవీలో హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు ఎవరన్న విషయాన్ని, మిగతా వివరాలను నిర్మాతలు ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తమిళ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో హీరోగా నటించే అవకాశం ఉంది.

Exit mobile version