Site icon NTV Telugu

Hollywood: ‘జాన్ విక్’ తర్వాత ఆ రేంజ్ యాక్షన్ ఉన్న సినిమా ఇదే…

Hollywood

Hollywood

హాలీవుడ్ లో యాక్షన్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వాళ్లకి బాగా నచ్చిన, అందరికీ తెలిసిన సినిమా ‘జాన్ విక్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి సినిమా వస్తుంది అంటే యాక్షన్ మూవీ లవర్స్ మంచి ఫైట్స్ ని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. జాన్ విక్ రేంజులో, అదే ఇంపాక్ట్ ఇచ్చే మరో ఫ్రాంచైజ్ ‘ది ఈక్వలైజర్’. డెంజెల్ వాషింగ్టన్ హీరోగా నటించిన ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి.

U.S గవర్నమెంట్ మెరైన్ మరియు మాజీ DIA అసాసిన్ గా ఎన్నో క్రైమ్ ని సాల్వ్ చేసిన రాబర్ట్ మెక్‌కాల్ (డెంజెల్ వాషింగ్టన్), అన్నీ వదిలేసి తన రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతను ఫేస్ చేసే పరిస్థితులే ‘ది ఈక్వలైజర్’ కథలకి మూలం. తనకంటూ ఫ్యామిలీ లేని రాబర్ట్ మెక్‌కాల్, తన లైఫ్ జర్నీలో పరిచయమైనా వారినే తన వాళ్లగా భావిస్తూ ఉంటాడు. వారికి ఏమైనా అయితే చాలు రాబర్ట్ మెక్‌కాల్ లోని ఒకప్పటి అసాసిన్ బయటకి వచ్చేస్తాడు. ఆ సమయంలో అతనికి అపోజిట్ నిలబడే ఫోర్స్ కానీ, అతని ఆపగలిగే మనిషి కానీ లేడు. ఈ ఫ్రాంచైజ్ నుంచి గతంలో వచ్చిన రెండు సినిమాల్లాగే, మూడో పార్ట్ లో కూడా యాక్షన్ పీక్స్ లో ఉంటుంది అని క్లియర్ గా చెప్తూ మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

డెంజెల్ వాషింగ్టన్ తో ఇప్పటికే ట్రైనింగ్ డే (2001), ది ఈక్వలైజర్ (2014), ది మాగ్నిఫిసెంట్ సెవెన్ (2016), మరియు ది ఈక్వలైజర్ 2 (2018) లాంటి సినిమాలని తెరకెక్కించిన ఆంటోయిన్ ఫుక్వా ‘ది ఈక్వలైజర్ 3’ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే సెట్ చేసిన అంచనాలని పర్ఫెక్ట్ గా మీట్ అయ్యే రేంజులో ‘ది ఈక్వలైజర్ 3’ ట్రైలర్ ఉంది. ఈ సినిమాలో డెంజెల్ వాషింగ్టన్, డకోటా ఫానింగ్, డేవిడ్ డెన్మాన్, సోనియా అమ్మర్, గిరోన్ ఇతర పాత్రల్లో నటించారు. 2004లో వచ్చిన మ్యాన్ ఆన్ ఫైర్ తర్వాత వాషింగ్టన్ మరియు డకోటా ఫానింగ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాని 2023 సెప్టెంబర్ 1న సోనీ పిక్చర్స్ విడుదల చేయనుంది.

Exit mobile version