Site icon NTV Telugu

Hollywood: రెండు వారాల్లో మూడు హిట్స్… థియేటర్స్ కళకళలాడుతున్నాయి

Hollywood

Hollywood

హాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది… కేవలం రెండు వారాల గ్యాప్ తో మూడు భారీ బడ్జట్ సినిమాలు హ్యూజ్ హైప్ తో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో సాలిడ్ హిట్ సినిమా రిలీజ్ కాలేదు, ఆ లోటుని పూర్తిగా తీర్చేసింది జులై నెల. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ వన్ సినిమాతో టామ్ క్రూజ్ ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ తో డెడ్ రేకనింగ్ సూపర్ హిట్ అయ్యింది. టామ్ క్రూజ్ మరోసారి యాక్షన్ లవర్స్ ని ఇంప్రెస్ చేయడంలో సక్సస్ అయ్యాడు. టామ్ క్రూజ్ వచ్చిన రెండు వారాలకే నోలెన్ ఓపెన్హీమర్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. నోలెన్ సినిమాలకి సెపరేట్ ఆడియన్స్ ఉంటారు.

టాక్ అండ్ క్రిటిక్ ఒపినీయన్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నోలెన్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్తారు. అలా వెళ్లిన ఆడియన్స్ ని ఓపెన్హీమర్ సినిమా మెప్పిస్తోంది. ఆటమ్ బాంబ్ తయారు చేసిన వ్యక్తి కథలోని ఎమోషన్ ని తీసుకొని నోలెన్ డైరెక్ట్ చేసిన విధానానికి మూవీ లవర్ అనే వాడు ఫిదా అవ్వాల్సిందే. ఓపెన్హీమర్ రిలీజ్ అయిన రోజే థియేటర్స్ లోకి వచ్చిన మరో సినిమా ‘బార్బీ’. ఈ మూవీకి కూడా హిట్ టాక్ రావడంతో హాలీవుడ్ ఖాతాలో కేవలం రెండు వారాల్లోనే మూడు సాలిడ్ హిట్స్ పడ్డాయి. అందుకే ట్రేడ్ వర్గాలు జులై మంత్ ని గోల్డెన్ పీరియడ్ గా మెన్షన్ చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాల్లో ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనేది చూడాలి.

Exit mobile version