Samantha : ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు.
Read Also : Rajamouli : మహేష్ ఒకే ఒక్కడు… SSMB29పై క్లారిటీ
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు.
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత తదితరులపై పది రోజుల పాటు మూడు సెట్స్‌లో షూటింగ్ చేశాం. సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది” అని చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!