NTV Telugu Site icon

HIT : ‘హిట్ 3’ ఒక్కరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు

Hit

Hit

హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా ఎంట్రీ ఇచ్చి, హిట్ 3 కోసం వెయిట్ చేసేలా చేసిన నాని ఇప్పుడు అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు.

Also Read : Mohan Babu : సుప్రీం కోర్టులో మంచు మోహన్ బాబుకు ఊరట

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్‌లో హిట్ 3 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాని అర్జున్ సర్కార్ లుక్‌ అదిరిపోయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ మాస్ హీరో ఎంట్రీ ఉంటుందని ప్రచారంలో ఉంది. ఆయనే హిట్ 4 హీరో అని అంటున్నారు. అంతేకాదు బాలయ్య, రవితేజ హిట్ 4 సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్లేవరో కాదు హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్ సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడివి శేష్ కామియో రోల్‌లో కనిపించనున్నారట. కథలో భాగంగానే ఈ ఇద్దరు నానికి సపోర్ట్‌గా ఇన్విస్టిగేషన్‌కు హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. వాస్తవం ఏమిటో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.