NTV Telugu Site icon

Dj Tillu 2: హీరోయిన్ మళ్లీ మారిందా?

Dj Tillu 2

Dj Tillu 2

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష్టాలు మాత్రం తప్పట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే… దర్శకుడు విమల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సిద్ధునే డైరెక్టర్ అవతారం ఎత్తాడు. డైరెక్టర్ సమస్య తీరిపోయింది అనుకుంటుంటే హీరోయిన్ సమస్య మాత్రం రిపీట్ అవుతూనే ఉంది.

‘DJ టిల్లు 2’ సినిమాలో ముందుగా యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె వరకూ ఈ విషయం వెళ్లిందో లేదో తెలియదు కానీ కొన్ని రోజులకే శ్రీలీల ప్లేస్ లో ‘అనుపమ పరమేశ్వరన్’ పేరు వినిపించింది. సిద్ధు కూడా అనుపమని హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు. ఇక ‘DJ టిల్లు 2’ షూటింగ్ కి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైంలో డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక అనుపమ ఈ సినిమాని తప్పుకుందనే వార్త అందరికీ షాక్ ఇచ్చింది. సిద్ధుకి ‘హీరోయిన్’ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుందా అనుకుంటున్న టైంలో మలయాళ బ్యూటీ ‘మడోనా సెబాస్టియన్’ ‘DJ టిల్లు 2’లో హీరోయిన్ గా నటించనుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే మడోనా సెబాస్టియన్ ఇమేజ్ కి ‘DJ టిల్లు 2’లోని హీరోయిన్ పాత్రకి సింక్ అవ్వట్లేదని, చిత్ర యూనిట్ ఆమెని కూడా తప్పించారట. తాజాగా ‘DJ టిల్లు 2’ హీరోయిన్స్ లిస్టులో ‘హిట్ 2’ బ్యూటీ ‘మీనాక్షీ చౌదరి’ కూడా చేరింది. అయితే ఈ విషయం ‘DJ టిల్లు 2’ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వాళ్ళకైనా తెలుసో లేదో పాపం. వాళ్లకి తెలియకుండా వాళ్ల సినిమాలో హీరోయిన్ ని పెట్టడం, తీసేయడం కూడా జరుగుతోంది. మడోనా సెబాస్టియన్, మీనాక్షీ చౌదరి, శ్రీలీలా ఇలా హీరోయిన్ల పేర్లన్నీ సోషల్ మీడియానే అనౌన్స్ చేసింది కానీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… ‘DJ టిల్లు 2’ మేకర్స్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారేమో చూడాలి.