మాస్ మహారాజ్ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు, జనవరి నెలలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మంచి జోష్ లో ఉన్న రవితేజ, రెండు నెలలు తిరగకుండానే ఏప్రిల్ నెలలో మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘రావణాసుర’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి సమ్మర్ సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇవ్వడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రావణాసుర సినిమా నుంచి ఇటివలే ‘రావణాసుర ఆంథెమ్’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
Dropping the high-voltage and foot-tapping promo of #PyaarLonaPaagal from #Ravanasura💥
Full song releasing on Feb 18🎶 @RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @rameemusic @SrikanthVissa @itswetha14 @saregamasouth pic.twitter.com/h0E0DPn7CK
— RT Team Works (@RTTeamWorks) February 16, 2023
తాజాగా ‘రావణాసుర’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ పిక్చర్స్ అనౌన్స్ చేశారు. హై ఎనర్జీ సాంగ్ తో డాన్స్ ఫ్లోర్ ని ఊపెయ్యడానికి రెడీగా ఉండండి అంటూ రావణాసుర సెకండ్ సాంగ్ ‘ప్యార్ లోనే పాగల్’ ప్రోమోని రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ సాంగ్ లిరికల్ వీడియో బయటకి రానుంది. సాంపిల్ గా వదిలిన ‘ప్యార్ లోనే పాగల్’ ప్రోమోలో రవితేజ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. తెలంగాణా స్లాంగ్ లో, బ్రేకప్ కి కూడా జోష్ ఫుల్ గా చెప్పాలి అనుకున్నారో ఏమో కానీ “దిల్ నీకే ఇచ్చానే, ఫుల్ నాకే ఇచ్చావే” అంటూ మంచి క్యాచీ లైన్స్ తో ‘ప్యార్ లోనే పాగల్’ సాంగ్ ని రాసాడు కాసర్ల శ్యామ్. రాహుల్ సిప్లిగంజ్ హైవోల్టేజ్ వాయిస్ ‘ప్యార్ లోనే పాగల్’ సాంగ్ ని మరింత హైపర్ గా చేసింది. సాంగ్ ఎండింగ్ లో రవితేజ సూపర్బ్ స్టెప్ వేసి ఫాన్స్ ని ప్రోమోతోనే ఖుషి చేశాడు. ప్రోమోలో ఉన్న ఎనర్జీ ‘ప్యార్ లోనే పాగల్’ సాంగ్ మొత్తం ఉంటే, రావణాసుర ప్రమోషన్స్ కి మంచి కిక్ స్టార్ట్ దొరికినట్లే. ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్షా నగార్కర్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న రావణాసుర సినిమా భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు.
Read Also: Ravanasura: ‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని బిజినెస్
Read Also: Raviteja: ‘రావణాసుర ఆంథెమ్’… ఈ పాట ఏంట్రా చారీ, ఇంత బాగుంది…