ISRO : భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో, సెంటర్లు, ప్రభుత్వ కార్యకలాపాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇస్రో కేంద్రాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. బెంగుళూరు, శ్రీహరి కోటతో సహా 11 ఇస్రో కేంద్రాల్లో, ఇతర కార్యాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవే కాకుండా ప్రముఖ రీ సెర్చ్ సెంటర్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ కట్టడాలు, సెంటర్లు, ఆఫీసుల వద్ద హై అలర్ట్ ఉంది.
Read Also : Nayanathara: అబ్బే.. నయనతార రెమ్యునరేషన్ వార్తలు అన్నీ ఫేక్?
ఇప్పటికే రాష్ట్రాల సీఎంలతో పాటు సీఎస్ లతో కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంటున్నారు. అలాగే సీఎస్ లకు 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించాలని కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు.. అత్యవసర నిర్ణయాలు తీసుకునేందుకు వెలసుబాటు కల్పించింది.
Read Also : Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. పౌరులను అప్రమత్తం చేసేందుకు సైరన్లు!
