Heroines : క్రేజ్ పడిపోతున్న టైమ్ లో హీరోయిన్లకు ఐటెం సాంగ్స్ బాగా కలిసొస్తున్నాయి. అప్పటి వరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించేసి ఒక్కసారిగా కుర్రాళ్లలో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అప్పటి వరకు చేసిన సినిమాలు ప్లాపులు వచ్చినా.. ఐటెం సాంగ్ హిట్ అయితే చాలు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సమంతకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ రాకముందు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఐటెం సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. నేషనల్ వైడ్ గా ఐటెం సాంగ్ క్రేజ్ తెచ్చుకుంది. దెబ్బకు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టాయి. ఖుషి సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో గ్యాప్ ఇచ్చింది.
Read Also : Kethika Sharma : కేతిక లక్ బాగుంది.. వరుసగా ఆఫర్లు..?
శ్రీలీల ఇండస్ట్రీలోకి ఓ తుఫాన్ లా వచ్చి విరుచుకుపడింది. సీనియర్లకు కూడా అందనంత ఫాస్ట్ గా ఆఫర్లు కొట్టేసింది. కానీ బ్యాడ్ లక్.. ఒకే ఏడాదిలో ఎనిమిది సినిమాలు చేసి రికార్డు సృష్టించినా.. అనుకున్న స్థాయిలో హిట్ పడలేదు. ప్లాపులే ఎక్కువగా వచ్చాయి. ఈ దెబ్బతో ఆమెకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ఒకానొక దశలో అసలు శ్రీలీలకు మళ్లీ ఆఫర్లు రావేమో అనుకున్నారు. అప్పుడు వచ్చిన పుష్ఫ-2లో దుమ్ము రేపే ఐటెం సాంగ్ చేసింది. కిస్సిక్ పాటతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇందులో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ.
కుర్రాళ్లకు మళ్లీ ఫేవరెట్ అయిపోయింది. ఇంకేముంది ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రాబిన్ హుడ్ లో ఛాన్స్ వచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమాలో నటించబోతోంది. అటు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ మూవీలో చేస్తోంది. ఇప్పుడు కేతిక శర్మ కూడా ఐటెం సాంగ్ తోనే అవకాశాలు పట్టేస్తోంది. రాబిన్ హుడ్ లో చేసిన అదిదా సర్ ప్రైజ్ ఐటెం సాంగ్ కు ముందు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. ఇండస్ట్రీ నుంచి తప్పుకునేలా కనిపించింది. వరుసగా ప్లాపులే ఉండటంతో అవకాశాలు రాక ఇబ్బంది పడింది. కానీ అదిదా సర్ ప్రైజ్ సాంగ్ లో ఘాటు పరువాలను చూపించేసింది.
ఆ క్రేజ్ తో ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. రవితేజ మూవీలో అవకాశం అందుకుంది. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రెండో మూవీకి సైన్ చేసింది. సాయిధరమ్ తేజ్ తో మరో మూవీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా ముద్దుగుమ్మలు ఐటెం సాంగ్స్ తో పోయిన ఫేమ్ ను మళ్లీ తెచ్చుకుంటున్నారు. మున్ముందు మరింత మంది ముద్దగుమ్మలు ఇదే బాట పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదేమో.
Read Also : Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్
