Site icon NTV Telugu

Keerthy Suresh: మహానటి మొదలుపెట్టింది… మెగా మేనియా మాములుగా ఉండదు

Keerthy Suresh

Keerthy Suresh

మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ, తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాలం’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుంది. సైరా తర్వాత చిరు పక్కన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ‘భోలా శంకర్’ సినిమాలో చిరుకి చెల్లి పాత్రలో ‘కీర్తి సురేష్’ నటిస్తోంది. ఆగస్ట్ 11న రిలీజ్ కి రెడీ అవుతున్న భోలా శంకర్ మూవీ డబ్బింగ్ వర్క్స్ ని ఇప్పటికే మేకర్స్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ గా మహానటి కీర్తి సురేష్ కూడా భోళా శంకర్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. భోళా శంకర్ టీజర్ త్వరలో రాబోతోంది అనే హింట్ ని కూడా కీర్తి సురేష్ ఇచ్చేసింది. మరి ఈ మూవీతో చిరు 2023లో సెకండ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version