దేశముదురు సినిమాతో యూత్ కి డ్రీం గర్ల్ అయ్యింది హన్సిక. తెలుగులో మంచి క్రేజ్ ఉండగానే తమిళ్ సినిమాల వైపు వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ అయిన హన్సిక గతేడాది డిసెంబర్ 4న సోహెల్ ని పెళ్లి చేసుకుంది. స్నేహితుల నుంచి భార్య భర్తలుగా మారిన ఈ జంట ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. క్యూట్ గా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇటివలే సోహెల్ మొదటి పెళ్లి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఇందులో హన్సిక, సోహెల్ మొదటి భార్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో హన్సిక, తన స్నేహుతురాలి భర్తనే లాగేసుకుంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలు తీవ్రస్థాయిలో రావడంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది.
“ఆ సమయంలో సోహెల్ నాకు తెలుసు కాబట్టి అతని విడాకులకి నేను కారణం కాదు. దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పబ్లిక్ ఫిగర్‌ని కాబట్టి, ప్రజలకి నన్ను విలన్ ని చేయడం చాలా సులభం. ఇది నేను సెలబ్రిటీగా ఉన్నందుకు చెల్లించే మూల్యం” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇదే విషయంపై సోహెల్ కూడా స్పందిస్తూ “నా మొదటి పెళ్లి, విడుకులు లాంటి విషయాలు రాంగ్ టైంలో బయటకి వచ్చాయి. నా ఫస్ట్ వైఫ్ తో విడిపోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దానితో హన్సికకి సంబంధం లేదు. తను నా ఫ్రెండ్ కాబట్టి ఆ సమయంలో నా పెళ్లికి వచ్చింది. అప్పుడు తీసిన ఫోటోలు బయటకి రావడంతో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి” అన్నాడు. మరి హన్సిక, సోహెల్ చెప్పిన మాటలు విన్న తర్వాత అయినా ఆ విమర్శలు ఆగుతాయేమో చూడాలి.