Site icon NTV Telugu

Bahishkarana: ఈ లక్ష్మీ కూడా కంచెకి ఆవలే ఉంది…

Bahishkarana

Bahishkarana

జీ 5లో అంజలి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సీరీస్ నుంచి ఇటీవలే అంజలి పుట్టిన రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. కంచె అవతల, ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్నట్లు ఉన్న అంజలి పోస్టర్ ని రిలీజ్ చేసి ‘బహిష్కరణ’ సీరీస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సస్ అయ్యాడు. లేటెస్ట్ గా అనన్య నాగళ్ల పుట్టిన రోజు కావడంతో, బహిష్కరణ టీం విషెష్ చెప్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. అంజలి పోస్టర్ లో చూపించినట్లే ఈ పోస్టర్ లో కూడా అనన్య నాగళ్ల కంచెకి అవతలే నిలబడి ఉంది. ‘లక్ష్మి’ అనే పాత్రలో నటిస్తున్న అనన్య నాగళ్ల కంప్లీట్ విలేజ్ లుక్ లో కనిపిస్తోంది. మల్లేశం తర్వాత అనన్య నాగళ్ల ఇంత విలేజ్ లుక్ లో కనిపించడం ఇదే మొదటిసారి.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ స్టిల్స్ నే పోస్ట్ చేస్తూ వచ్చిన అనన్య నాగళ్ల పోర్టుఫోలియోలో ఈ పోస్టర్ ఒక మంచి వేరియేషన్ అనే చెప్పాలి. పల్లెటూరి వాతావరాణాన్ని చూపించేలా డిజైన్ చేస్తున్న క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇక రవీంద్ర విజయ్, శ్రీతేజ్ లాంటూ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ నెలలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న బహిష్కరణ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ ని పోస్టర్స్ తోనే ముందుకి తీసుకోని వెళ్తున్నారు. మరి ఈ సీరీస్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కానీ గ్లిమ్ప్స్ కానీ ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.

Exit mobile version