Liger: ‘లైగర్ సినిమా’ హీరో విజయ్ దేవరకొండని ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారి అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అయ్యి విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘లైగర్’ మూవీని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి భారి నష్టాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ కి ఊహించని షాక్ తగిలింది. సినిమా పోతే పోయింది కానీ ‘లైగర్’ సినిమాలో రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నాయి.
బ్లాక్‌ను వైట్ చేసుకోవడానికే ‘లైగర్’ సినిమాని రూపొందించారంటూ కాంగ్రెస్ పార్టీని చెందిన ‘బక్క జుడ్సన్’ ఫిర్యాదు చేశాడు. దీంతో విదేశి పెట్టుబడుల చట్టాలని(Foreign Exchange Management Act FEMA) ఉల్లంగించిందనే అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ‘ఈడి’ రంగంలోకి దిగి పూరి, చార్మీ, విజయ్ దేవరకొండలకి విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇటివలే ‘లైగర్’ సినిమా నిర్మాతలు పూరి, చార్మీ విచారణకి హాజరయ్యారు. నవంబర్ 17వ తేదీ దాదాపు 15 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ‘ఈడి’ కార్యాలయానికి వెళ్లాడు. ఇక్కడ ‘లైగర్’ సినిమా ఆర్థిక వ్యవహారాలు, విదేశీ పెట్టుబడులు, రాజకీయ నాయకుల పెట్టుబడుల విషయంపై విజయ్ దేవరకొండని విచారించినట్లు తీసినట్లు తెలుస్తోంది.