Site icon NTV Telugu

Tarun: లవర్ బాయ్ తరుణ్ రీ ఎంట్రీ..?

Tarun

Tarun

Tarun: తరుణ్.. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా అప్పట్లో చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్ అందించిన వాటిలో ఒకటిగా నిలిచింది. ఇక తరుణ్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.లవర్ బాయ్ గా మారిన తరుణ్ ఏ సినిమా తీసినా అది హిట్ లిస్ట్ లోకి వెళ్లిపోయేది. ఇక కాలం మారుతున్న కొద్దీ కొత్త హీరోలు, కొత్త కథలు వచ్చి చేరాయి. ఇక తరుణ్ సైతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన వ్యాపారలాతో బిజీగా మారాడు. అయితే తరుణ్ రీ ఎంట్రీ కోసం మాత్రంఆయన అభిమానులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

తరుణ్ లో చిన్న చేంజేస్ తప్ప పెద్ద మార్పులేమీ లేవు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అలానే ఉన్నాడు. అందుకు సాక్షమే ఈ ఫోటో. రీసెంట్ గా తరుణ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అందంగా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ లో మరోసారి ఆశలు రేగాయి. తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకొంటున్నారు. మొన్నటికి మొన్న నువ్వే నువ్వే రీ రిలీజ్ఈవెంట్ లో తాను సినిమా చేయాలనుకుంటానని, మంచి కథ ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో త్వరగా తరుణ్ రీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి అభిమానుల కొరకు తరుణ్ రీ ఎంట్రీ ఇస్తాడో.. లేదో చూడాలి.

Exit mobile version