Site icon NTV Telugu

Vikram: కమల్ సినిమాలో సూర్య అధికారికం.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే

Vikram

Vikram

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌ పై తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే మతిపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్  గూస్ బంప్స్ ను తెప్పించడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నట్లు గతకొన్ని రోజుల నుంచి  గుప్పుమంటున్నాయి. ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ తో మతిపోతుంటే ఇక సూర్య కూడా ఉన్నాడు అని తెలియడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు సూర్య నటిస్తున్నాడు అని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు కాబట్టి ఫ్యాన్స్ లో కొద్దిగా అనుమానం ఉండేది.

ఇక తాజాగా సూర్యను ఆహ్వానిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన  చేయడంతో అనుమానాలు పటాపంచలు అయిపోయి పూనకాలు మొదలైయ్యాయి. ఈ చిత్రంలో సూర్య కనిపించేది కొద్దిసేపే అయినా ఇంపాక్ట్ ఉంటుంది అని మేకర్స్ తెలిపారు. ఇక తన చిత్రంతో సూర్య నటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అడిగిన వెంటనే నటిస్తాను అని చెప్పినందుకు సూర్యకు ధన్యవాదాలని డైరెక్టర్ లోకేష్ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షుకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందో.. పడుకోబెట్టిస్తుందో చూడాలి.

Exit mobile version