Hero Srikanth unveils ‘Bangaru Bomma’ song!
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా హీరో హీరోయిన్లుగా రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. ఈ చిత్రం లోని ‘బంగారు బొమ్మ’ పాటను హీరో శ్రీకాంత్ హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ”మూవీ టైటిల్ బాగుంది. ఈ పేరు తెలుగు వారందరికి సుపరిచితమే. అన్నయ్య చిరంజీవి ఇదే పేరుతో ఓ సినిమా చేశారు. అప్పట్లో అది పెద్ద మ్యూజికల్ హిట్. అంత గొప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలోని ‘బంగారు బొమ్మ…’ పాట విన్నాను. బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు. ‘చిరంజీవి గారి స్ఫూర్తితోనే చిత్రసీమలోకి అడుగుపెట్టి, సినిమాలు నిర్మిస్తున్నామని, చిరంజీవి ఉన్నంత గొప్ప మనసు శ్రీకాంత్ కు ఉండటంతో ఆయనతోనే ఈ చిత్రంలోని తొలి గీతాన్ని ఆవిష్కరింపచేశామ’ని నిర్మాతలు తెలిపారు. ‘ఈ చిత్రానికి మహవీర్ చక్కని ట్యూన్స్ ఇచ్చారని, హీరో శ్రీరామ్ నిమ్మల చాలా చక్కగా డాన్స్ చేశారని, ఇందులో సిగ్నేచర్ స్టెప్స్ చాలా ఉన్నాయ’ని అన్నారు. ఇది కొత్త తరహాలో సాగే రివేంజ్ డ్రామా అని దర్శకుడు మధుసూదన్ చెప్పారు. శ్రీకాంత్ ఆవిష్కరించిన ‘బంగారు బొమ్మ…’ గీతాన్ని రాంబాబు గోశాల రాయగా, అభయ్ జోద్బుర్ కర్ పాడారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, హీరోయిన్ శుభశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ తదితరులు పాల్గొన్నారు.
