Siddharth: ‘కెజిఎఫ్ 2’ పాన్ ఇండియానా..? నవ్వొస్తోంది ఆపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సిద్దార్థ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఈ హీరోకు సాటి ఎవరు లేరు. ప్రశాంతంగా ఉన్న వారిని తన ట్వీట్స్ తో కదిలించి మరీ వివాదాలను తెచ్చుకోవడం ఈ సిద్దు కు అలవాటు. ఇక మొన్నటివరకు టికెట్స్ రేట్స్ గురించి తన అభిప్రాయమంటూ ఏవేవో చెప్పుకొచ్చిన ఈ హీరో గత కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా పై పడ్డాడు. పాన్ ఇండియా పదం అంటే నవ్వొస్తుంది అని, అస్సలు పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటూ అంత గొప్పలు చెప్పుకుంటారు ఏంటి అంటూ తనదైన శైలిలో పాన్ ఇండియాకు అర్ధం చెప్పాడు. ఇక మరోసారి పాన్ ఇండియా గురించి సిద్దు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిద్ధార్థ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఎస్కేప్ లైవ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా ‘కెజియఫ్2’ సక్సెస్, ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
” కెజిఎఫ్ 2 సినిమాను పాన్ ఇండియా సినిమా అంటుంటే నవ్వొస్తోంది.. చిత్ర పరిశ్రలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న హిందీ సినిమా హిట్ అయితే హిందీ సినిమా అంటారు.. అదే ఒక ప్రాంతీయ భాష సినిమా హిట్ అయితే దాన్ని ఎందుకు పాన్ ఇండియా సినిమా అంటారు. ఇప్పుడు కెజిఎఫ్ 2 హిట్ అయ్యింది.. అది పాన్ ఇండియా కాదు.. కన్నడ సినిమా అని ఎందుకు అనడం లేదు. నేను 15 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. అన్ని భాషల్లోనూ సినిమాలు చేశాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్‌గా, టాలీవుడ్లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్‌కు కూడా.. ఇలా నేను ఏ భాషలో చేసినా అది నాకు ఇండియన్ సినిమానే.. అలాగే పిలవాలి కూడా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!