NTV Telugu Site icon

Siddharth: ‘కెజిఎఫ్ 2’ పాన్ ఇండియానా..? నవ్వొస్తోంది ఆపండి

Siddarth

Siddarth

హీరో సిద్దార్థ్  గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఈ హీరోకు సాటి ఎవరు లేరు. ప్రశాంతంగా ఉన్న వారిని తన ట్వీట్స్ తో కదిలించి మరీ వివాదాలను తెచ్చుకోవడం ఈ సిద్దు కు అలవాటు. ఇక మొన్నటివరకు టికెట్స్ రేట్స్ గురించి తన అభిప్రాయమంటూ ఏవేవో చెప్పుకొచ్చిన ఈ హీరో గత కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా పై పడ్డాడు. పాన్ ఇండియా పదం అంటే నవ్వొస్తుంది అని, అస్సలు పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటూ అంత గొప్పలు చెప్పుకుంటారు ఏంటి  అంటూ తనదైన శైలిలో పాన్ ఇండియాకు అర్ధం చెప్పాడు. ఇక మరోసారి పాన్ ఇండియా గురించి సిద్దు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిద్ధార్థ్‌ తాజాగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్‌ ఈ సందర్భంగా ‘కెజియఫ్‌2’ సక్సెస్‌, ‘పాన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

” కెజిఎఫ్ 2 సినిమాను పాన్ ఇండియా సినిమా అంటుంటే నవ్వొస్తోంది.. చిత్ర పరిశ్రలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న హిందీ సినిమా హిట్  అయితే హిందీ సినిమా అంటారు.. అదే ఒక ప్రాంతీయ భాష సినిమా హిట్ అయితే దాన్ని ఎందుకు పాన్ ఇండియా సినిమా అంటారు. ఇప్పుడు కెజిఎఫ్ 2 హిట్ అయ్యింది.. అది పాన్ ఇండియా కాదు.. కన్నడ సినిమా అని ఎందుకు అనడం లేదు. నేను 15 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. అన్ని భాషల్లోనూ సినిమాలు చేశాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్‌ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్‌గా, టాలీవుడ్‌లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్‌ సింగ్‌కు కూడా.. ఇలా నేను ఏ భాషలో చేసినా అది నాకు ఇండియన్ సినిమానే.. అలాగే పిలవాలి కూడా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.