కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే శివ కార్తికేయన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అయలాన్. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అయలాన్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ… మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేసిన అయలాన్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అయలాన్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని స్పీడప్ చేసారు మేకర్స్.
అయలాన్ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ మూవీ కోసం ఒక ఏలియన్ పాత్రని సృష్టించారు. ఏలియన్ పాత్రకి వాయిస్ ని ఇచ్చాడు హీరో సిద్ధార్థ్. పాటలు చాలా బాగా పాడే సిద్ధార్థ్ వాయిస్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ సినిమాలో సింబాకి సిద్ధార్థ్ వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు శివ కార్తీకేయన్ కోసం ఏలియన్ కి వాయిస్ ఇచ్చాడు సిద్ధార్థ్. అయలాన్ మేకర్స్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన సిద్ధార్థ్ కి థాంక్స్ చెప్తూ స్పెషల్ ట్వీట్ చేసారు. ఇదిలా ఉంటే సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ కి గేమ్ ఛేంజర్ అవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. శివ కార్తికేయన్ మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ తో అయలాన్ సినిమాని నిర్మిస్తున్నారు, దీంతో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. మరి శివ కార్తికేయన్ ఎంతవరకు ఈ మూవీని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తాడు? పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాడా లేక సౌత్ కి మాత్రమే పరిమితం అవుతాడా అనేది చూడాలి.
Thank you Actor #Siddharth for being a part of Ayalaan and giving life to our cosmic Neighbour 👽
Every bit of enthusiasm, commitment and hardwork you've given has made our Ayalaan more realistic and lovely. And we hope the audience will love your work as much as we did✨… pic.twitter.com/xbLA07BJhA
— KJR Studios (@kjr_studios) December 13, 2023