Site icon NTV Telugu

Men Too: అమ్మాయిలు లేకుంటే ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంటుంది మావా…

Men Too

Men Too

ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఆడవాళ్లు పడే ఇబ్బందులు, వాళ్లు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉండే వివక్ష, వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఒత్తిడి, ఇంట్లో ఉండే వేధింపు ఇలా ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి, ప్రేక్షకుల సింపతీని కూడా గెలుచుకొంది హిట్ అయ్యాయి. అయితే సమస్యలు ఆడవాళ్లకి మాత్రమే ఉంటాయా? మగవాళ్లకి ఉండవా? మగవాళ్ళు మనుషులు కాదా అంటున్నాడు బ్రహ్మాజీ అండ్ టీం. నరేష్ అగత్య్స, బ్రహ్మాజీ, హర్ష, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా #MenToo. ఈ మూవీలో మెన్ పడే ఇబ్బందులని చూపిస్తూ తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ని శర్వానంద్ లాంచ్ చేశాడు. పెళ్లికి సిద్ధమవుతున్న శర్వానంద్, Men Too టీజర్ ని రిలీజ్ చెయ్యడం సాహసం అనే చెప్పాలి.

ముఖ్యంగా ఎండ్ షాట్, ఆ సమయంలో వచ్చే డైలాగ్ చూసిన తర్వాత కూడా శర్వానంద్ ఈ మూవీ టీజర్ ని లాంచ్ చెయ్యడం సాహసమే. ఇక టీజర్ విషయానికి వస్తే కంప్లీట్ ఫన్ రైడ్ లా ప్రతి ఒక్కరికి అనిపించడం గ్యారెంటీ. బ్రహ్మాజీ క్యారెక్టర్ బాగుంది, టీజర్ లో డైలాగ్స్ చాలా బాగా పేలాయి. అయితే ఇలా మగవాళ్ల సమస్యలు చూపిస్తాం అని ఒక పెద్ద డైరెక్టర్, ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి ఒక సినిమా చేశాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ ఫస్ట్ హాఫ్ లో చూపించిన కథకి… సెకండ్ హాఫ్ లో, క్లైమాక్స్ లో చెప్పిన విషయానికి సంబంధం ఉండదు. కథ పూర్తిగా కొత్త ఫ్లేవర్ లో కనిపిస్తుంది. మరి ఈ Men Too మూవీ కూడా ఆ సూపర్ హిట్ సినిమాగా ఓపెనింగ్ మగవాళ్ల సమస్యలతో మొదలయ్యి… ఎండ్ అయ్యే టైంకి అమ్మాయిల వైపు వెళ్ళిపోతుందో లేక నిజంగానే అబ్బాయిల ప్రాబ్లమ్స్ ని ఫన్నీ వే లో చెప్పారో చూడాలి.

Exit mobile version