Site icon NTV Telugu

Ram Charan: రామ్ చరణ్‌కు క్రేజీ అవార్డ్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

Charan

Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరుని టాప్ ట్రెండింగ్ లో పెడుతున్నారు మెగా ఫాన్స్. #RamCharanTo LeadIndianCinema #FutureOfYoungIndiaRC అనే హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. ఉన్నపళంగా మెగా అభిమానులు జోష్ లోకి కారణం ఎంటా అని చూస్తే, చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఇన్ ఎంటర్టైన్మెంట్(Future of Young India in Entertainment Award to Charan) అవార్డ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ కి ఈ అవార్డ్ రావడాన్ని చాలా స్పెషల్ గా చూస్తున్నారు మెగా ఫాన్స్. చరణ్ తో పాటు ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూ సూద్, తాప్సీలు ఈ అవార్డ్ రేసులో ఉన్నారు. వీళ్లందరినీ వెనక్కునెట్టి రామ్ చరణ్ అవార్డు సాధించడం విశేషం. ఈ అవార్డు రావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మెగా అభిమానులు ‘రామ్ చరణ్ సిన్స్ 2007’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

తనయుడు రామ్ చరణ్ తేజ్ కి వచ్చిన అవార్డ్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. “నాన్నా.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు సాధించడం నాకు ఎంతో సంతోషంగానూ.. గర్వంగా కూడా ఉంది. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ అమ్మా, నాన్న” అంటూ ట్వీట్ చేశారు. ‘లైక్ ఫాదర్, లైక్ సన్’ అంటూ చిరు ట్వీట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే, చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘RC 15’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే ‘బుచ్చిబాబు’ దర్శకత్వంలో ఇటివలే మొదలైన ‘RC 16’ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లనున్నాడు.

Exit mobile version