నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, ఇటీవలే తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్ చేసాడు. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, స్పై సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ అయినా కూడా నిఖిల్ మరో మూడు సినిమాలని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు నిఖిల్. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఇండియా హౌజ్’ గురించి.
ఈ రెండు ప్రాజెక్ట్స్ తో నిఖిల్ 20వ సినిమా ‘స్వయంభు’గా అనౌన్స్ అయ్యింది. అర్జున్ సురవరం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఠాగూర్ మధు బ్యానర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేసారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న స్వయంభు మూవీ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూనే రూపొందనుంది. ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు నిఖిల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. నిఖిల్ కంప్లీట్ మేకోవర్ తో చేస్తున్న ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
The Journey Begins #Swayambhu
@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/9ar6yG7vyO
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 18, 2023
