Site icon NTV Telugu

Naveen Chandra: ఈ యంగ్ హీరోకి వారసుడు వచ్చాడు…

Naveen Chandra

Naveen Chandra

అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించి మంచి డెబ్యు ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఆ తర్వాత కూడా హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేశాడు కానీ అవి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ హిట్స్ లేకపోవడంతో నవీన్ చంద్ర సోలో హీరోగానే ఎందుకు చెయ్యాలి? మంచి క్యారెక్టర్స్ వచ్చినా చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచే నవీన్ చంద్ర బిజీ యాక్టర్ అయిపోయాడు. ఎన్టీఆర్, రానా లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి రోల్స్ చేసిన నవీన్ చంద్ర, ఇప్పుడు ఒటీటీ కోసం చేసే వెబ్ సీరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒటీటీలో నవీన్ చంద్రకంటూ ఒక మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. ఇలా బిజీ ఫేజ్ లో ఉన్న నవీన్ చంద్ర, ‘ఒర్మా’ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ నవీన్ చంద్ర, సోషల్ మీడియాలో “Blessed with baby boy” అని ట్వీట్ చేశాడు. నవీన్ చంద్ర అభిమానులు, ఈ హీరోని కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు.

Read Also: 18 Pages: హమ్మయ్య… ముంతమసాలాలో అనుపమ ఏం కలిపిందో తెలిసిపోయింది

Exit mobile version