NTV Telugu Site icon

Dhanush: మిస్టర్ ధనుష్… కీప్ ఎంటర్టైనింగ్ అస్… 

Dhanush

Dhanush

ఈరోజు ధనుష్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ధనుష్ పేరు మారుమోగుతోంది. #Dhanush #CaptinMiller #CaptainMiller టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ధనుష్ కి ఊరికే రాలేదు. ఫేస్ పైన నువ్వు హీరోనా అనే రిజెక్షన్ ని ధనుష్ చాలా కాలమే భరించాడు, ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ లో గ్రే మ్యాన్ చేసిన ధనుష్, ఇంటర్నేషనల్ రేంజ్ కి కూడా ఎదిగాడు. ప్రతి చోట స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న ధనుష్, మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి నటుడిగా ఒక క్రెడిబిలిటీ ఉంది. నిజానికి ధనుష్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూడడమే కష్టం అనే దగ్గర నుంచి వీడురా హీరో అంటే అనిపించే స్థాయికి ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. హీరో అవ్వాలి అనుకునే వాళ్ళకే కాదు ఒక డ్రీమ్ ని అచీవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళందరికీ ధనుష్ నిజంగానే ఇన్స్పిరేషన్.

తమిళనాడు నుంచి ఇప్పుడు సూర్య, కార్తి, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు తెలుగు మార్కెట్ కోసం బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు కానీ మూడు దశాబ్దాల క్రితమే రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకి పాన్ ఇండియా ఇమేజ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు ధనుష్. తమిళనాడులో మోస్ట్ టాలెంటెడ్ హీరో అనే పేరు తెచ్చుకోని కెరీర్ నిలబెట్టుకున్న ధనుష్, ‘ఆనంద్ ఎల్.రాయ్’ లాంటి టాప్ డైరెక్టర్ కి మోస్ట్ ఫేవరేట్ హీరో అంటే ఒక నటుడిగా ధనుష్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన మార్కెట్ బౌండరీస్ ని చెరిపేస్తున్న ధనుష్… సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అన్నీను. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ధనుష్, ప్రస్తుతం తన 50వ సినిమాని సొంత డైరెక్షన్ లో స్టార్ట్ చేసాడు. సినిమాలు ఫ్లాప్ అవ్వోచ్చేమో కానీ ధనుష్ యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అలాంటి నటుడికి, ఆ స్థాయి నటుడికి హ్యాపీ బర్త్ డే విషెష్ చెప్తూ, మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. మిస్టర్ ధనుష్… కీప్ ఎంటర్టైనింగ్ అస్…

Show comments