Site icon NTV Telugu

Naresh: మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి కథ… నరేష్ అన్న మళ్లీ కామెడీ చేస్తున్నాడు

Naresh

Naresh

అల్లరి నరేష్ గా యాభైకి పైగా సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించాడు నరేష్. ఇటీవలే కాలంలో ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్న నరేష్, తన పేరుకి ముందున్న అల్లరిని పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఇంటెన్స్ యాక్టింగ్స్ తోనే హిట్స్ కొడుతున్న నరేష్, తన కంబ్యాక్ తర్వాత అన్నీ ప్రయోగాలే చేస్తున్నాడు. ఒక సెక్టార్ ఆడియన్స్, నరేష్ ఫాన్స్ మాత్రం ఒకప్పటి అల్లరి నరేష్ ని చూడాలని కోరుకుంటున్నారు. ఆ లోటు తీర్చడానికి నరేష్ తన 62వ సినిమాలో అల్లరి చేయడానికి రెడీ అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని తెరకెక్కించిన సుబ్బు, అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ అయ్యింది.

Read Also: Adipurush :14 వ రోజుకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

నరేష్ తో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాని ప్రొడ్యూస్ చేసిన హాస్య మూవీస్, అల్లరి నరేష్ 62వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని కొత్తగా బార్ లో అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ తో అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ ని మరోసారి ఆడియన్స్ గుర్తు చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్, చోట k ప్రసాద్ ఎడిటింగ్, రిచర్డ్ సినిమాటోగ్రఫి అల్లరి నరేష్ 62 సినిమాకి యాడెడ్ ఎస్సెట్స్ అవ్వనున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీ టైటిల్, హీరోయిన్ లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version