Site icon NTV Telugu

Abbas: బ్రేకింగ్.. హాస్పిటల్ లో హార్పిక్ అబ్బాస్

Abbas

Abbas

Abbas: హార్పిక్ యాడ్ లో అబ్బాస్ గుర్తున్నాడా..? అదేనండీ ఒక్కప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, ప్రేమదేశం హీరో అబ్బాస్. ఆ సినిమా నుంచి అబ్బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో అబ్బాస్ కటింగ్ కు ఎంత క్రేజ్ అంటే మాటల్లో చెప్పలేనిది. ఇక తాజాగా అబ్బాస్ హాస్పిటల్ లో చేరాడు. ప్రస్తుతం అబ్బాస్ అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సహా అక్కడే నివాసముంటున్నాడు.

కాగా అబ్బాస్ గత కొన్నిరోజులుగా కాలి నొప్పితో బాధపడుతున్నాడు. అతని కాలికి గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేయాలనీ చెప్పారట. దీంతో నేడు అబ్బాస్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ అబ్బాస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “డాక్టర్లు సర్జరీ అని చెప్పినప్పటి నుంచి నా మనసంతా గందరగోళంగా ఉంది. దాన్ని అధిగమించడానికి చాలా కష్టపడ్డాను. అయితే సర్జరీ తరువాత నాకు కొంత ఉపశమనం కలిగింది. డాక్టర్స్ కు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అబ్బాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version