‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుండడంతో అన్ని భాషల్లోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు టీం.
Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్
ఇప్పటి వరకూ కేరళ, ముంబైలలో ప్రెస్ మీట్లలో పాల్గొన్న రాఖీ భాయ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు రూట్ మ్యాప్ రివీల్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 10న సాయంత్రం 6.30 గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ జరగనుంది. ఏప్రిల్ 11న ఉద్యమ 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. అదే రోజున ఉదయం 10.30 గంటలకు సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. 11.30కి వైజాగ్ లో ప్రెస్ మీట్ ఉంటుంది. ఏప్రిల్ 11నే సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. ఇలా రెండ్రోజుల్లోనే ఏమాత్రం రెస్ట్ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు రాఖీ భాయ్.
