Best Web Series 2023 in India: ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ కూడా యాడ్ కావడంతో ఇప్పుడు థియేటర్లలో సినిమాలు విడుదలైనట్లే.. ఓటీటీల్లో కొన్ని కొత్త సినిమాలతో పాటు ప్రతివారం ఎన్నో వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏడాది మొత్తం మీద ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పలు వెబ్‌సిరీస్‌లను నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలను మీ ముందుకు తెస్తున్నాం చూసేయండి.
నెట్ ఫ్లిక్స్
రానా నాయుడు: వెంకటేష్-రానా ప్రధాన పాత్రల్లో రిలీజ్ అయిన ఈ రానా నాయుడు విమర్శలు ఎదుర్కొన్నా ‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సిరీస్‌ల జాబితా (400)’లో 336వ స్థానంలో నిలిచింది. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బూతులు మాత్రం తెలుగు వారు తట్టుకోలేక పోయారు.
ది రైల్వేమెన్: 1984లో చోటుచేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు రైల్వేస్ తో లింక్ చేస్తూ చేసిన సిరీస్ ఇది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మాధవన్, కేకే మేనన్, దివ్యేందు శర్మ, మందిరా బేడీ తదితరలు నటించి ఆకట్టుకున్నారు.
కాలాపాని: అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు కలుషితమవడానికి కారణమేంటి? అనే అంశంతో ఈ సిరీస్ ను సమీర్ సక్సేనా, అమిత్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. మోనా సింగ్, అశుతోష్ గోవారికర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
స్కూప్: జర్నలిస్ట్ జాగృతి పాఠక్ జీవితాధారంగా హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ను క్రైమ్ డ్రామాగా తెరకెక్కిచారు. కరిష్మా తన్నా, ప్రొసెన్‌జిత్ ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ది ఫ్రీలాన్సర్: సిరియా సరిహద్దుల్లో ఉన్న ఐసిస్‌కు చెరలో చిక్కుకున్న అలియా అనే యువతిని రక్షించేందుకు రంగంలోకి దిగిన అవినాష్ కామత్ న్ ఎలాంటి సాహసం చేశాడనే అంశం మీద ఈ సిరీస్ తెరకెక్కించగా అందరినీ ఆకట్టుకుంది.
సేవ్ ది టైగర్స్: ముగ్గురు భార్యా బాధితుల కథ ఈ సేవ్ ది టైగర్స్. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరుల నటించగా తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.
అతిథి: హీరో వేణు తొట్టెంపూడి యాక్ట్ చేసిన తొలి వెబ్‌సిరీస్ అతిధి. అవంతిక మిశ్రా, అదితి గౌతమ్ (సియా గౌతమ్) కీలక పాత్రధారులుగా వ్యవహరించిన ఈ సిరీస్ కి భరత్ వై.జి దర్శకత్వం వహించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూత, దీనికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించైనా ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.
ఫర్జి: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తొలి వెబ్ సిరీస్ ఈ ఫర్జి. రాజ్- డీకే దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతి, రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దొంగనోట్ల చుట్టూ తిరిగే కథ అందరినీ ఆకట్టుకుంది.
వ్యూహం: సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కగా ఇటీవలే ఈ సిరీస్ రిలీజ్ అయింది. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకుడుగా వ్యవహరించిన ఈ సిరీస్ అందరినీ కట్టుకుంది.
దహాద్: హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఇది డిజిటల్ ఎంట్రీ సిరీస్. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానని లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయిన యువతి కేసు విచారణ చుట్టూ తిరిగే ఈ సిరీస్ ను కీమా కగ్టి, రుచికా ఒబెరాయ్ డైరెక్ట్ చేశారు.
జీ 5..
అయలీ: ఊరి కట్టుబాట్లు దాటి ఓ అమ్మాయి ఎలా చదువుకుంది? అనే అంశంతో రూపొందిన ఈ అయాలి సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.
వీరప్పన్: వీరప్పన్ స్వయంగా మాట్లాడిన మాటలతో కూడిన డాక్యుమెంటరీ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.
సోనీలివ్
స్కామ్ 2003- ది తెల్గీ స్టోరీ: 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.