రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో తాండవం చేస్తుంది. ప్రభాస్ ని ఛత్రపతి తర్వాత అంత ఇంటెన్స్ యాక్షన్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. థియేటర్స్ లో సలార్ సినిమాని చూసిన ఫ్యాన్స్… ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సూపర్బ్ గా చూపించాడు, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, కాటేరమ్మ ఫైట్ సీన్ అండ్ ఎలివేషన్ డైలాగ్ కి గూస్ బంప్స్ వచ్చాయి, ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బెండింగ్ గా ఉంది, శృతి హాసన్ ని సేవ్ చేసే ఫైట్ విజిల్స్ వేయించింది, క్లైమాక్స్ లో పార్ట్ 2 లీడ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది… అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజమే సినీ అభిమానులు గమనించినట్లు సలార్ సినిమాలో మేజర్ హైలైట్స్ ఇవే. అయితే అందరూ గమనించని, థియేటర్స్ లో అందరూ ఒకేసారి నవ్విన సీన్స్ కూడా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ చాలా సైలెంట్ గా ఆ సీన్స్ ని డిజైన్ చేస్తూ ప్రభాస్ కి ఒక అలవాటు పెట్టాడు.
సినిమా చూడని వాళ్లు ఇక్కడికే చదవడం ఆపేయండి ఎందుకంటే స్పాయిలర్ ని రివీల్ చేయబోతున్నాం. సలార్ సినిమాలో ప్రభాస్ ఫైట్స్ ఇరగదీసాడు. అయితే ప్రభాస్ సినిమాలో ఖాన్సార్ లో అడుగు పెట్టిన తర్వాత ఆర్టిస్ట్ ఎమ్మెస్ చౌదరి వాళ్ల కొడుకుని చంపుతాడు. కాటేరమ్మ ఎపిసోడ్ లో ప్రభాస్ చంపేది ఎమ్మెస్ చౌదరి కొడుకు క్యారెక్టర్ నే… ఇతన్ని చంపిన తర్వాత ప్రభాస్ పృథ్వీరాజ్ కి సారీ చెప్తాడు. ఇక్కడి నుంచే సలార్ సెకండ్ హాఫ్ లో ఇంటెన్సిటీ పెరుగుతుంది, ప్రభాస్ యుద్ధం మొదలుపెడతాడు. ఈ సీన్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఏకంగా ఎమ్మెస్ చౌదరినే అందరి ముందూ తల నరికి చంపుతాడు. ఈ కారణంగా ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ని జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత కూడా ప్రభాస్ పృథ్వీరాజ్ కి సారీ చెప్తాడు. అలా ఇద్దరినీ చంపి ప్రభాస్ పృథ్వీరాజ్ కి సారీ చెప్పడం ఫ్యాన్స్ తో అరిపించేలా చేసింది. ఆ తర్వాత ప్రభాస్ ఉగ్రం రూపం దాల్చి ఫైట్ చేస్తాడు కాబట్టి సారీ చెప్పకుండానే చంపుకుంటూ పోతాడు.