NTV Telugu Site icon

Akkineni Akhnil: బాబాయ్… అయ్యగారు అతనితో మాత్రం సినిమా చేయకండి

Akkineni Akhil

Akkineni Akhil

అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథకి కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మెంటల్ మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఏజెంట్ సినిమా హిట్ అయ్యి ఉంటే అఖిల్ రేంజ్ అసలు వేరేలా ఉండేది. కథాకథనాల్లో ఉన్న లోపం కారణంగా ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. బయ్యర్స్ కి నష్టాలు మిగిలించిన ఈ సినిమాతో అఖిల్ మాస్ హిట్ కొట్టాలి అనే కల కలగానే మిగిలిపోయింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. అఖిల్ నెక్స్ట్ సినిమాని యువీ క్రియేషన్స్ తో చేస్తున్నాడు అనే టాక్ ఉంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అఖిల్ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ లోనే ఫేడ్ అవుట్ అయిన డైరెక్టర్స్ లిస్టులో జాయిన్ అయిన లింగుస్వామి, ఇటీవలే రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేసి తెలుగు ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్ తో సినిమా అంటే, అసలే కష్టాల్లో ఉన్న అఖిల్ మరిన్ని కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే. పైగా కోలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే సమయంలో రొటీన్ రొట్ట సినిమాలని చేస్తున్నారు. మానాడు లాంటి సినిమా చేసిన వెంకట్ ప్రభు… నాగ చైతన్యకి కస్టడీలాంటి ఫ్లాప్ ఇచ్చాడు. ఈ లిస్టులో మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు. అసలు కోలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలంటేనే భయపడుతుంటే ఇక లింగుస్వామితో సినిమా చేస్తే మాత్రం అఖిల్ ఇబ్బందుల్లో పడినట్లే. ఈ విషయం క్లియర్ కట్ గా తెలిసు కాబట్టే అఖిల్ లింగుస్వామితో ప్రాజెక్ట్ చేయడానికి ముందుకి రావట్లేదు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

Show comments