NTV Telugu Site icon

Hema Photo Leaked: రేవ్ పార్టీలో హేమ ఫోటో లీక్?

Hema Photo Leaked

Hema Photo Leaked

Hema Photo Leaked From Bengaluru Rave Party: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సినీ ప్రముఖులు అందరిని షాక్ కి గురి చేస్తుంది. దానికి కారణం ఈ పార్టీలో కన్నడ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నటీనటులు ఉన్నారంటూ వార్తలు రావడమే. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఇవ్వగా దానికి విభిన్న రంగాలకు చెందిన వారిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. సినీ రంగం నుంచి కూడా పలువురు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కన్నడ మీడియాలో ప్రధానంగా తెలుగు నటి హేమ ఈ కార్యక్రమానికి హాజరైనట్టు, పోలీసులు అరెస్ట్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Hema : రేవ్ పార్టీలో బుక్కై.. బుకాయించిన హేమ

అయితే తనకేమీ సంబంధం లేదని తాను హైదరాబాదులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ ఆమె ఒక వీడియో బైట్ రిలీజ్ చేసింది. అయితే ఆమె వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికి బెంగళూరు పోలీసులు హేమను కూడా తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్ లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం. అయితే హేమ నిజంగానే బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా? లేక పోలీసులు అదుపులోకి తీసుకుని పూచికత్తు మీద విడిచి పెట్టారా? అలా చేసినా సరే ఆమె తనకు ఆ పార్టీతో సంబంధం లేదని ఎందుకు చెబుతోంది? అనే అంశాల చుట్టూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

Show comments