Hema Arrested Appeared in Burkha: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న నటి హేమను అక్కడి పోలీసులు వచ్చి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ద్వారా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అందరి లాగానే ఆమెను కూడా విచారణకు హాజరు కమ్మని కోరితే ఆమె తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు హాజరు కాలేను అని చెప్పింది. మరోసారి నోటీసులు ఇచ్చినా మరొక సారి కూడా నోటీసులకి సమాధానం ఇవ్వలేదు సరి కదా విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
Hema Arrested: బ్రేకింగ్: టాలీవుడ్ నటి హేమ అరెస్ట్!!!
ఆమెను అరెస్ట్ చేసే ముందు ఫార్మాలిటీ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించారు. అందుకు ఆమెను హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్ కి వెళ్ళే సమయంలో ఆమె బుర్కా ధరించి ఉండడం గమనార్హం. అయితే ఆమె బుర్కా ధరించి ఉండగా ఆమెకు టెస్టులు చేస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హేమ అరెస్టు వ్యవహారంలో ఇప్పటివరకు బెంగళూరు సిసిఎస్ పోలీసులు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. హేమ మీద డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన కేసుతో పాటు ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేసిన మరో కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. దీంతో ఆమె మీద ఎలాంటి సెక్షన్లు నమోదు చేయబోతున్నారు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది.
