NTV Telugu Site icon

Dhee Choreographer Chaitanya: బ్రేకింగ్.. ఆ బాధ తట్టుకోలేక ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

Chy

Chy

Choreographer Chaitanya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధలకు సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే చూసాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిండు ప్రాణాన్ని బలిఇస్తున్నారు. తాజాగా ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య.. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఢీ 13 లో చైతన్య కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. కొత్త కొత్త డ్యాన్స్ మూమెంట్స్ తో జడ్జీలను ఇంప్రెస్ చేశాడు. ప్రభుదేవా సైతం అతని డ్యాన్స్ ను మెచ్చుకున్నాడు. అయితే ఢీ వలన నేమ్, ఫేమ్ వచ్చాయి కానీ డబ్బు రాలేదని, అప్పుల వాళ్లు తనని చిత్రవధ చేస్తున్నట్లు చైతన్య వీడియోలో చెప్పుకొచ్చాడు. తన అమ్మానాన్న, చెల్లెలిని క్షమించమని కోరాడు.

Gayathri Rao: హ్యాపీ డేస్ లో నిఖిల్ లవర్ అప్పు.. అయ్యబాబోయ్..ఇప్పుడేంటి ఇలా ఉంది

ఇక ఢీ షోలో ఉన్న తన ఫ్రెండ్స్ ను క్షమించమని పేరు పేరునా చెప్పుకొచ్చాడు. తాను నెల్లూరు క్లబ్ హోటల్ లో ఉన్నానని, ఇదే తన చివరి వీడియో అని తెలిపాడు. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చాను అని, తన లాగా మిగతావారు ఎవరు కాకూడదని చెప్పుకొచ్చాడు. అప్పు తీర్చగలిగే స్తోమత ఉంటేనే అప్పు తీసుకోవాలని, తాను చాలా ట్రై చేశాను కానీ, తన వలన కాలేదని చెప్పుకొచ్చాడు.దయచేసి అందరు తనను క్షమించాల్సిందిగా కోరాడు. ఇక ఆ హోటల్ లోనే అతను ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అప్పులు ఉంటే చనిపోవాలా అన్నా.. ఇంకొంచెం కష్టపడితే ఎలాగోలా అప్పులు తీర్చేయొచ్చు. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి అన్నా.. నువ్వెంతో పెద్ద కొరియోగ్రాఫర్ అవుతామనుకున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Show comments