NTV Telugu Site icon

Ajith: అజిత్ కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా.. హీరోయిన్ లా ఉందే

Ajith

Ajith

Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అజిత్ సుపరిచితమే. ఇక ప్రస్తుతం అజిత్ నటించిన తునీవు సినిమా తెలుగులో తెగింపు పేరుతో సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అజిత్ సినిమాల గురించి పక్కన పెడితే.. అతను చాలా ప్రైవేట్ పర్సన్. సినిమాలు, కుటుంబం, బైక్ రైడ్స్.. అంతే. అజిత్ భార్య షాలిని.. అదేనండీ బేబీ షామిలి అక్క బేబీ షాలిని.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక పాప, ఒక బాబు. వీరెప్పుడు సోషల్ మీడియాలో కనిపించరు. ఫ్యామిలీ ఫంక్షన్స్, వెకేషన్స్ లో తప్ప కెమెరా కంటికి కూడా చిక్కరు.

అజిత్ కూతురు అనౌష్క ప్రస్తుతం అమెరికాలో చదువుకొంటుంది. తాజాగా వీరి ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో అందరి కళ్లు అనౌష్క మీదనే ఉన్నాయి. అప్పుడే ఈ చిన్నది టీనేజ్ కు వచ్చేసింది. అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో హీరోయిన్ మాదిరి కనిపిస్తోంది. త్వరలోనే ఆమె ఎంట్రీ ఉండవచ్చని తలా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కొడుకు అద్విక్ తల్లితండ్రులతో పాటు ఉంటూ చదువుకుంటున్నాడు. కూతురును చూడడానికి విదేశాలకు వెళ్లిన ఈ జంట ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి తల్లిదండ్రుల పోలికలనే కాకుండా వారి నటనను కూడా పుణికిపుచ్చుకుని అనౌష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Show comments