Site icon NTV Telugu

Hasthina Puram: ‘హస్తినాపురం’ మొదలైంది

Hasthinapuram Movie Shoot Started

Hasthinapuram Movie Shoot Started

Hasthinapuram Movie Shoot started with Pooja: యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన అథర్వ రిలీజ్‌కు ఉండగానే.. మరో సినిమా పట్టాలెక్కించారు. అథర్వ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్న కార్తీక్ రాజు కాసు క్రియేషన్స్ బ్యానర్ మీద కాసు రమేష్ నిర్మిస్తున్న ‘హస్తినాపురం’ అనే సినిమాలో కార్తీక్ రాజు నటిస్తున్నారు. రాజా గండ్రోతు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ సినిమాను ప్రారంభించారు మేకర్స్. మొదటి షాట్ కి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అందజేశారు.

Bigg Boss Telugu 7: గౌతమ్ Vs అమర్.. డాక్టర్ బాబుకు పెరుగుతున్న సపోర్ట్

ఇక ఈ క్రమంలో హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ఈ ‘హస్తినాపురం కొత్త పాయింట్‌తో రాబోతోందని, రెగ్యులర్ సినిమాలా ఉండదని అన్నారు. మా డైరెక్టర్ అద్భుతంగా కథ రాసుకున్నారన్న ఆయన మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఆల్రెడీ హనుమాన్ సాంగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారని అన్నారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ రాజా గండ్రోతు మాట్లాడుతూ హస్తినాపురం అనే టైటిల్ వినగానే ఎంత పాజిటివిటీ ఉందో, సినిమా కూడా అంతే ఉంటుందని, నా గురువు వినాయక్ దగ్గర పని చేశానని అన్నారు. మంచి కథ, మంచి టీంతో రాబోతున్నామని, మా అందరినీ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నానని నా మీద నమ్మకంతో నన్ను పిలిచి అవకాశం ఇచ్చారని అన్నారు.

Exit mobile version