Site icon NTV Telugu

Harry Potter: హాలీవుడ్ లో తీవ్ర విషాదం.. హ్యారీ పాటర్ నటుడు మృతి

Hollywood

Hollywood

ది బీస్ట్ మస్ట్ డై, ప్యారిస్ బై నైట్, మిడ్‌నైట్ ఇన్ సెయింట్ పీటర్స్‌బర్గ్, ది వింగ్స్ ఆఫ్ ది డోవ్, ది ఇన్‌సైడర్, స్లీపీ హాలో, ది ఒమన్, ది కింగ్స్ స్పీచ్, విక్టోరియా మరియు అబ్దుల్ లాంటి సినిమాల్లో నటించి… హ్యారీపోటర్ ఫ్రాంచైజ్ తో ఫేమ్ సంపాదించుకున్న ఐరిష్-ఇంగ్లీష్ యాక్టర్ “సర్ మైఖేల్ గాంబోన్” (82) కన్నుమూశారు. న్యుమోనియా కారణంగా ఇంగ్లాండ్‌లోని ఎస్కిస్‌లో గాబోన్ మరణించారు. హ్యారీ పోటర్ ఫ్రాంచైజ్ లో ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్‌డోర్, హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ మరియు విజార్డ్రీ హెడ్‌మాస్టర్ రోల్స్ ని ప్లే చేసాడు. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఎనిమిది సినిమాలు వస్తే అందులో ఆరింటిలో గాబోన్ నటించారు. స్టేజ్ షోస్ నుంచి సినిమాల్లోకి వచ్చిన గాబోన్ మొదటి రెండు హ్యారీ పాటర్ సినిమాల్లో నటించలేదు. మూడో సినిమా నుంచు ఫ్రాంచైజ్ ఎండ్ అయ్యే వరకూ ఉన్న గాబోన్ మరణం హాలీవుడ్ చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచింది.

Read Also: Credit Card: ఇన్ కమ్ ప్రూఫ్ లేకున్నా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

Exit mobile version