NTV Telugu Site icon

Harish Shanker: రిపోర్టర్ కు పేలింది.. స్టేజి మీదనే ఇచ్చిపడేసిన డైరెక్టర్

Harish

Harish

Harish Shanker: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. చాలా కాలం తరువాత పవన్ తో మరో గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక హరీష్ శంకర్ కు, బన్నీ వాసుకుఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికి తెల్సిందే. ఆయన అనే కాదు కొత్త దర్శక నిర్మాతలు కానీ, హీరోలు కానీ తమకు సపోర్ట్ కావాలని అడగడం ఆలస్యం నిర్మొహమాటంగా హరీష్ ముందుడి సపోర్ట్ ఇస్తాడు. తాజాగా బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేస్తున్న 2018 సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ కు హరీష్ శంకర్ కూడా హాజరయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన 2018 సినిమాను బన్నీ వాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మీడియా ఇంట్రాక్షన్ పెట్టిన బన్నీ వాస్ ను రిపోర్టర్ సురేష్ కొండేటి ఒక ప్రశ్న అడిగాడు. సురేష్ కొండేటి గురించి మీడియాలో ఉన్నవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు జరిగినప్పుడు ఏ రిపోర్టర్ అడగని ప్రశ్నలు, హీరోయిన్లను అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటాడు.

తాజాగా ఆయన.. తెలుగు ఇండస్ట్రీని అవమానించే విధంగా ఒక ప్రశ్న అడిగాడు. ” ఈ సినిమా చూసాకా మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయగలడా..? తెలుగు నిర్మాత ఇంత సాహసం చేయగలడా..? అని ఒక నిర్మాతగా మీకు అనిపించిందా..? ” అని అడిగాడు. అందుకు బన్నీ వాస్ .. ఈ ప్రశ్నకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఆన్సర్ చెప్తాడు అని చెప్పగా.. హరీష్.. సురేష్ కొండేటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ” నేను ఈ మధ్య యూట్యూబ్ ల్లో చూస్తున్నా.. సురేష్ కొండేటి.. ప్రతి ప్రెస్ మీట్ లో ఎవరు అడగని ఒక సాహోసోపేతమైన ప్రశ్నలు వేసి.. దాన్ని యూట్యూబ్ లో వైరల్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఒక సామెత ఉంది.. వినేవాడు సురేష్ అయితే.. చెడ్డోడు హరీష్ అంట. అసలు ప్రపంచం సినిమా మొత్తం మన చేతికి వస్తుంటే.. నువ్వింకా డబ్బింగ్ సినిమా అది అంటున్నావ్. ఆర్ఆర్ఆర్ సినిమాను హిందీలో డబ్బింగ్ సినిమా అనుకున్నారా..? బాహుబలిని డబ్బింగ్ సినిమా అన్నారా..?.. కెజిఎఫ్ సినిమాను డబ్బింగ్ సినిమా అనుకున్నారా..? డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమా కాదు.. సినిమా ఆంటే. ఏ సినిమా ఎక్కడికైనా వెళ్తుంది అంటే సంతోషించాలి. మన ఆర్టిస్టులు, మన దర్శకులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా అంటే.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా చూస్తున్న రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేసావంటే జాలి వేస్తుంది.

ఇక్కడకు ప్రశ్నలు వేయడానికి వచ్చావా..? ఆర్గ్యూ చేయడానికి వచ్చావా..? ఆర్గ్యూ చేయడానికి వస్తే.. రా కూర్చుందాం. డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తే తప్పేంటి. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అనే ప్రయత్నాన్ని మీరు మెచ్చుకోవాలి. ఇది మీ సినిమా కాబట్టి మొదట మీకు చూపిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియోను హరీష్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నపుడు.. చురకలు వేసే నోరు కూడా ఉంటుంది.. తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసాకా.. నెటిజన్లు.. అతను చాలా రోజుల నుండి విచిత్ర మైన ప్రశ్నలు వేస్తూ అదేదో ఆనందం పొందుతున్నాడు… ఎవరు పెడతారు చురక అనుకుంటే మీరు పెట్టారు. అని కొందరు. . తెలుగోడి సత్తా ఏంటో చూపించారు.. సినిమా అంటే సినిమా అంతే అది డబ్బింగా రీమేకా అని కాదు అని చెప్పారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.