Harish Shankar Tweet on Janasena Glass Dialouge goes viral in social media: ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఒక సినిమా మొదలుపెట్టారు కానీ ఎందుకో ఆ సినిమా నిలిపివేసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే జనసేనకి ఊతం ఇచ్చే విధంగా గాజు గ్లాసు గుర్తు గురించి రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన పొలిటికల్ కార్యక్రమంలో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గాజు గ్లాస్ గురించి డైలాగ్ పెట్టినప్పుడు నేను హరీష్ శంకర్ ని అడిగితే దానికి ఆయన మీరు ఓడిపోయే కొద్ది ఎదుగుతారు.
Niharika: రాహుల్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ.. ఆ విషయం బయటపెట్టిన నిహారిక
అలాగే గాజు గ్లాస్ కూడా పగిలిన కొద్ది పదునెక్కుతుంది అని చెప్పాడని అన్నారు. ఎందుకయ్యా ఇలాంటి డైలాగులు రాయాల్సిన అవసరం ఉందా? అని అడిగితే మీకు తెలియదు సార్, మా బాధలు మాకు ఉన్నాయి. ఇలాంటి డైలాగులు పెట్టకపోతే మీ అభిమానులు ఊరుకోరు, చంపేస్తారు అని అన్నాడని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోని ఒక నెటిజన్ కట్ చేసి హరీష్ శంకర్ పేరుతో ట్వీట్ చేయగా దానికి హరీష్ శంకర్ స్పందించాడు. మీరు ఒప్పుకోవాలి కానీ తుప్పు రేగ్గొడతాం మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ సర్కార్ అంటూ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పాడు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవిశంకర్, నవీన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పవన్ అభిమానులందరూ మీసం మేలేసేలా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.
మీరు ఒప్పుకోవాలేగాని
తుప్పు రేగ్గొడతాం 😂😂
Thank you for your love
Sarkar @PawanKalyan https://t.co/W9mkO4feJr— Harish Shankar .S (@harish2you) April 1, 2024